Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:34 AM

కేంద్ర కార్పొరేట్ విధానాలపై పోరాటం తప్పదు : NPRD నేతలు

04-01-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి, జిల్లా కేంద్రం:

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పొరేట్, మతోన్మాద విధానాలను తిప్పికొట్టే వరకు పోరాటం కొనసాగుతుందని NPRD జిల్లా అధ్యక్ష–కార్యదర్శులు సురుపంగా ప్రకాష్, వనం ఉపేందర్ స్పష్టం చేశారు.

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో అంధుల అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే వీబీజీ–రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నరేగా చట్టబద్ధ హక్కును కుదించి గ్రామీణ ప్రజల జీవనోపాధిపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు.

కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్స్, శ్రమశక్తి నీతి–2025 అమలు చేస్తూ పెట్టుబడిదారులకే లాభం చేకూరుస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరవడం ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడమేనని అన్నారు. మతం ఆధారిత పాలన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీగా ప్రకటించిన వికలాంగుల పెన్షన్ పెంపును అమలు చేయకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే పెన్షన్ పెంచకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, బి.భగవంతు రెడ్డి, సంజీవ, శంకర్, నాగు, నరసింహ, హరిబాబు, చందు, గోపీ, మదన్ రావు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

కేంద్ర కార్పొరేట్ విధానాలపై పోరాటం తప్పదు : NPRD నేతలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News