Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

కాంగ్రెస్ మద్దతుతో ఘన విజయం – మైనారిటీకి చారిత్రక అవకాశం

18-12-2025 230 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరంచ గ్రామ ఉపసర్పంచ్‌గా మొల్ల కరిమ్ ఎన్నిక

కాంగ్రెస్ మద్దతుతో ఘన విజయం – మైనారిటీకి చారిత్రక అవకాశం

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మానూర్ మండలం బోరంచ గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో రెండు వార్డు మెంబర్‌గా పోటీ చేసిన మొల్ల కరిమ్ 89 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో గురువారం గ్రామ సర్పంచ్‌తో పాటు గెలుపొందిన వార్డు సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో మొల్ల కరిమ్‌ను ఏకగ్రీవంగా ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికతో బోరంచ గ్రామంలో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఉపసర్పంచ్‌గా ఎంపిక కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఉపసర్పంచ్‌గా ఎన్నికైన అనంతరం మొల్ల కరిమ్ మాట్లాడుతూ… తనపై విశ్వాసం ఉంచి ఓటు వేసిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ సోదరుల అండతో పాటు గ్రామంలోని అన్ని వర్గాల ప్రజల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. బోరంచ గ్రామ అభివృద్ధి, సంక్షేమమే తన తొలి లక్ష్యమని పేర్కొన్నారు.

Sthanikam

కాంగ్రెస్ మద్దతుతో ఘన విజయం – మైనారిటీకి చారిత్రక అవకాశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News