Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:36 AM

జంగారెడ్డిగూడెం లో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించిన ముద్దాయి అరెస్ట్

11-02-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డి గూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు కామవరపుకోట పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలు కలకోటి వెంకట సత్యవతి ఒంటరిగా నివాసం ఉంటుంది ఈనెల ఏడవ తేదీ రాత్రి 9:00 సమయంలో ఆమె భోజనం చేస్తుండగా ఇంటి తలుపులు కొట్టిన శబ్దం విని తలుపు తీసింది ముఖానికి గుడ్డ కట్టుకొని ఉన్న గుర్తు తెలియని ఒక వ్యక్తి ఆమెపై దాడి చేసి రాడ్డుతో తలపై కొట్టి వృద్ధురాలి మెడలోని రెండు కాసుల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు దీనిపై వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తడికలపూడి ఎస్సై టి చెన్నారావు కేసు నమోదు చేశారు సిఐఎంవి సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై విచారణ నిర్వహించి నిందితుడు కామవరపుకోట మండలం పాతూరు గ్రామానికి చెందిన అడవి కొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రి అలియాస్ అంజిగా గుర్తించారు కామవరపు కోట చింతలపూడి వెళ్లే రోడ్డులో గ్రామ శివారు ఆర్ఆర్జికే డైరీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక లక్ష 40 వేల రూపాయలు విలువైన 14.600 గ్రాముల బంగారు గొలుసు నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ వృద్ధురాలిపై దాడికి వినియోగించిన దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు కేసును చేదించిన సీఐ ఎం.వి సుభాష్ ఎస్ఐ టి చెన్నారావు క్రైమ్ పార్టీ ఏఎస్ఐ ఎన్ వి సంపత్ కుమార్ పీసీలు ఎస్కే షాన్ ఎన్ రమేష్ ఏ సుధీర్ లను ఏఎస్పీ అభినందించారు

Sthanikam

జంగారెడ్డిగూడెం లో వృద్ధురాలి మెడలో గొలుసు అపహరించిన ముద్దాయి అరెస్ట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News