Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:42 PM

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్

06-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల పరిధిలోని జంమ్గీ కే గ్రామంలో ఘనంగా డాక్టర్ బాబు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జంమ్గీ జాన్ మాదిగ మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనలో కఠోరమైన పరిశ్రమికుడు. ఉన్నతమైన లక్ష్యాలు ఉన్న స్వాప్నికుడు. గనుకనే అతడు ఎన్నో రాజకీయ శిఖరాల్నీ అధిరోహించగలిగాడు. ఆనాడు దేశ రాజకీయాల్లో ఉద్దండులు అనబడు వారు సైతం ఆయన మాటను పాఠంగా ఒప్పుకునేంత ఉన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం అని తెలియజేశారు,ఐదు దశాబ్దాల కాలంపాటు రాజకీయాల్లో ఓటమెరుగని ప్రజానేతగా కొనసాగడంమంటే మామూలు విషయం కాదు. భారత రిపబ్లిక్ తొలి లోక్సభ(1952)లో ప్రవేశించిన డా.బాబూ జగ్జీవన్ రామ్ వరుసగా ఎనిమిదిసార్లు గెలిచాడు. ముప్ఫైమూడు సంవత్సరాలు కేంద్ర కేబినెట్ మంత్రిగా, ఉప ప్రధానమంత్రిగా భారతదేశ సమగ్ర అభివృద్ధికి విశిష్ట సేవలందించిన రాజకీయ దురంధరుడు మరొకరు ఈనాటికీ లేరు. మొదటి శ్రేణి పార్లమెంటేరియన్గా నిలిచాడు. ఏ శాఖామంత్రిగా ఉన్న ఆ శాఖకు వన్నె తెచ్చిన నేత. డా. బాబూ జగ్జీవన్ రామ్ నేతృత్వం వహించిన శాఖల్లో ఆయన తీసుకువచ్చిన సంస్కరణలు ఈనాటికీ ఆమోదయోగ్యమైనవిగా మనుగడలో ఉండడం ఆయన దూరదృష్టికి తార్కాణాలు. దేశం క్లిష్ట పరిస్థితుల్నీ ఎదుర్కొంటున్న ప్రతీసారి ఆయన పనితనం ప్రపంచం ప్రశంసించే స్థాయిలో ఆయన్ను నిలబెట్టిందని జంమ్గీ జాన్ మాదిగ ఉపన్యాసించారు.ఈ కార్యక్రమంలో అంజయ్య, పి రాజి పటేల్ , ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డేవిడ్ మాదిగ, బోర్గీ రాములు, పెంటయ్య, నాగయ్య, రాములు, భూమయ్య, దేవదాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జంమ్గీ (కె) లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న :సర్పంచ్ రియానా అమీన్ సాబ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News