Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:59 AM

జాతీయ లోక్ అదాలత్‌తో వేగవంతమైన న్యాయం – ప్రజలకు ఎస్పీ పిలుపు

జాతీయ లోక్ అదాలత్‌తో వేగవంతమైన న్యాయం – ప్రజలకు ఎస్పీ పిలుపు

జాతీయ లోక్ అదాలత్‌తో వేగవంతమైన న్యాయం – ప్రజలకు ఎస్పీ పిలుపు
March 24, 2026 06:20 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుకోకుండా లేదా క్షణికావేశంలో జరిగిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు.జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న, రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న కేసులను పరస్పర అవగాహనతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు.కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సమస్యలకు పరిష్కారం పొందే అవకాశం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందని అన్నారు. ప్రజలు అనవసర వివాదాలకు దూరంగా ఉండి, తమ జీవితాలను సుఖశాంతులతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.రాజీ పడదగిన కేసులు:

క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి పంపకాలు, కుటుంబ మరియు వైవాహిక సమస్యలు,బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు వంటి అనేక కేసుల్లో ఇరువర్గాల పరస్పర సమ్మతితో రాజీ కుదుర్చుకోవచ్చు.సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి:

సైబర్ నేరాల బాధితులు కోల్పోయిన డబ్బులను తిరిగి పొందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. ముఖ్యంగా రూ.25,000/- లోపు నష్టం జరిగిన కేసుల్లో, లోక్ అదాలత్ ద్వారా ఫిర్యాదు చేసి, కోర్టు అనుమతితో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే రీఫండ్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉందని తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి జిల్లా స్థాయి అధికారులు నుండి కానిస్టేబుల్ స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన, సులభమైన,న్యాయబద్ధమైన పరిష్కారం లభిస్తుందని ప్రజల్లో అవగాహన పెంచాలని, ఈ నెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News