Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం

14-03-2026 272 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి – కార్యదర్శి వి. మాధవి లత

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ యాదాద్రి భువనగిరి అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు సూచనల మేరకు సంస్థ కార్యదర్శి వి. మాధవి లత చౌటుప్పల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా చౌటుప్పల్ కోర్టు హాలులో పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చౌటుప్పల్ కోర్టు పరిధిలో ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్నందున రాజీ పడదగిన కేసులను ఎక్కువగా పరిష్కరించేలా పోలీసు అధికారులు పూర్తి సహకారం అందించాలని కోరారు.దీనికోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాజీకి అనుకూలమైన కేసుల్లో లోక్ అదాలత్ నోటీసులు అందజేయాలని సూచించారు. ప్రీ-సిట్టింగ్స్ ద్వారా ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌పై కోర్టు పరిధిలోని ప్రతి గ్రామానికి సమాచారం చేరేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. లోక్ అదాలత్ నిర్వహణను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ. జయరాజు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు అందిస్తున్నారని తెలిపారు. ఈ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ కేసులు తగ్గడమే కాకుండా సమాజంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.మార్చి 28 వరకు ప్రతిరోజు కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకునేలా వెసులుబాటు ఉంటుందని తెలిపారు.ఈ సమావేశంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూధన్ రెడ్డి, సీఐ మన్మధకుమార్, నారాయణపూర్ సీఐ రాములు, ఎక్సైజ్ సీఐ బాలోజీ నాయక్, ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసులు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ లోక్ అదాలత్ విజయవంతానికి పోలీసుల సహకారం అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News