Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 09:39 PM

జాతీయ రహదారి పక్కనే దొంగల ఆగడాలు

జాతీయ రహదారి పక్కనే దొంగల ఆగడాలు

జాతీయ రహదారి పక్కనే దొంగల ఆగడాలు
06-02-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

చివ్వెంల మండలంలో భద్రతపై రైతుల ఆందోళన

చివ్వెంల: జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–365కు అతి సమీపంలోనే దొంగలు రెచ్చిపోవడం చివ్వెంల మండలంలో భద్రతపై తీవ్ర సందేహాలు కలిగిస్తోంది. అక్కలదేవిగూడెం గ్రామ పరిధిలో అమరగాని ఆంజనేయులు కు చెందిన వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ లోని విలువైన పనిముట్లను గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ దొంగిలించారు.ఈ ఘటనలో రైతులకు అత్యంత అవసరమైన స్టార్టర్ పెట్టెలు, విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్లడంతో సాగు పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పంటల సాగు కోసం సిద్ధమవుతున్న రైతులకు ఈ దొంగతనం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జాతీయ రహదారి పక్కనే వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవడంపై రైతులు, గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దొంగలు ఇప్పటికీ పట్టుబడకపోవడంతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది.రాత్రి వేళ పహారా ఏర్పాటు చేయాలని, పోలీస్ గస్తీని పెంచాలని, దొంగతనాలకు పాల్పడుతున్న వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులదేనని వారు స్పష్టం చేస్తున్నారు.

Sthanikam

జాతీయ రహదారి పక్కనే దొంగల ఆగడాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News