సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ నాలుగు గంటల సమయంలో జాతీయ రహదారి 65పై కావేలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేలి గ్రామానికి చెందిన నాయకుడు నాగేందర్ తండ్రి నరసయ్య (వయస్సు 61) కావేలి నుంచి దిగ్వాల్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.ఈ క్రమంలో వెనుక నుంచి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపబడుతున్న కారు (నంబరు KA 38 F 1327) అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు నాగేందర్ సన్నాఫ్ నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో కావేలి గ్రామంలో విషాదం నెలకొంది.
PRINT TIME: October 15, 2026 05:07 PM
జాతీయ రహదారి 65పై కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

22-01-2026
986 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ నాలుగు గంటల సమయంలో జాతీయ రహదారి 65పై కావేలి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేలి గ్రామానికి చెందిన నాయకుడు నాగేందర్ తండ్రి నరసయ్య (వయస్సు 61) కావేలి నుంచి దిగ్వాల్ వైపు తన ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.ఈ క్రమంలో వెనుక నుంచి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా నడుపబడుతున్న కారు (నంబరు KA 38 F 1327) అతని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు నాగేందర్ సన్నాఫ్ నరసయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, కారు డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో కావేలి గ్రామంలో విషాదం నెలకొంది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి