Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:12 PM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి
February 01, 2026 08:33 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్

సిపిఎం, వామపక్ష పార్టీల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా వచ్చిన మహాత్మా గాంధీ పేరుమీద ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని దీని స్థానంలో “విబి - జి రామ్ జి” పేరుతో కొత్త చట్టాన్ని తెస్తూ నిధుల కోత, పనిదినాల కోతకు కుట్ర చేసిందని, కూలీల పొట్టగొట్టే కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 నుండి 15 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మండల, పట్టణ కేంద్రాలలో నిరసనగా సభలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ పిలుపునిచ్చారు. చౌటుప్పల పట్టణంలోని కందాల రంగారెడ్డి భవనంలో సిపిఎం జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుంటోజు శ్రీనివాస్ చారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జహంగీర్ పాల్గొని మాట్లాడుతూ,పేదల పొట్ట కొట్టడానికి ఉపాధి హామీ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా,“విబి - జి రామ్ జి ” అనే కొత్త చట్టాన్ని కేంద్రం తెచ్చిందని అన్నారు. పాత చట్టంలో 90శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంటే, కొత్త బిల్లులో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపిందని విమర్శించారు.దీంతో ఆర్థిక స్తోమత లేని రాష్ట్రాలు ఈ భారాన్ని భరించలేక పథకాన్ని ఆపేసే కుట్ర ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నది అన్నారు. వ్యవసాయ సీజన్లో 60 రోజుల పని దినాలను తొలగించాలనే నిబంధన కూలీలను తిరిగి యజమానుల వద్ద తక్కువ వేతనానికి బానిసలుగా మార్చే కుట్ర కోనము దాగిందాని అన్నారు.ఈ కొత్త చట్టం వల్ల రాజ్యాంగం కల్పించిన పని హక్కును కూలీలుకోల్పోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది కూలీలు ఈ పథకంపై ఆధారపడి ఉన్నారని కొత్త చట్టం వల్ల నిధులు, పనిదినాలు పూర్తిగా తగ్గిపోతాయని, కూలీలు వలస బాట పట్టవలసి వస్తుంది అన్నారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే విబి - జి రామ్ జి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, పని దినాలను 200 రోజులకు పెంచడంతోపాటు రోజువారీ వేతనంరూ.800లకు పెంచాలని, పట్టణ పేదలకుకూడా ఈ చట్టాన్ని వర్తింపజేయాలని,నిధులు మొత్తం కేంద్రమే భరించాలని, చట్టం అమలు బాధ్యత కేంద్రమే తీసుకోవాలని జహంగీర్ డిమాండ్ చేసినారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జెల్లెల పెంటయ్య, బూరుగు కృష్ణారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు యండి పాషా,గంగాదేవి సైదులు,గోశిక కరుణాకర్,అవ్వారు రామేశ్వరి,సిరిపంగి స్వామి, కొమటిరెడ్డి చంద్రారెడ్డి, బొల్లు యాదగిరి,బొడ్డుపల్లి వెంకటేష్,మద్దెల రాజయ్య, దొడ యాదిరెడ్డి, గుండు వెంకట్ నర్సు, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్, మధ్యపురం రాజు, రాచకొండ రాములమ్మ, వనం ఉపేందర్, కోట రామచంద్రారెడ్డి,గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News