Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:25 PM

జర్నలిస్టులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

14-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి పిలుపు

జనవరి 23,24వ తేదీల్లో హైదరాబాదులోని నాంపల్లి లో ఉన్న మీడియా అకాడమీ ఆడిటోరియంలో జరగనున్న జర్నలిస్టుల శిక్షణా తరగతులను జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలని టి యు డబ్ల్యూజె ( ఐజేయు) జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి కోరారు. శిక్షణ తరగతులను దృష్టిలో ఉంచుకొని బుధవారం నాడు జిల్లాలోని పలు మండలాల్లో పర్యటించిన అనంతరం చిట్యాల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ మీడియా అకాడమీ,టీయూడబ్ల్యూజే(ఐజేయు ) ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు సంబంధించి ఆసక్తి ఉన్న జర్నలిస్టులు ఈనెల 17వ తేదీలోగా టి యు డబ్ల్యూ జె జిల్లా కమిటీకి తమ పేర్లను అందజేయాలని తెలిపారు. జర్నలిజంలో వృత్తిపరంగా ఎంతో నైపుణ్యం కోసం అందజేస్తున్న ఈ శిక్షణ జర్నలిస్టులకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, వృత్తిపరంగా మెలకువలు నేర్పించడం కోసం శిక్షణ తరగతులు ఏర్పాటుచేసిన మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ తో పాటు ఇంటి స్థలం, ఇల్లు, హెల్త్ కార్డులు అందించడం కోసం టియుడబ్ల్యూజే జిల్లా కమిటీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీయూడబ్ల్యూజే జిల్లా నాయకులు పులిమామిడి మహేందర్ రెడ్డి, దోటి శ్రీనివాస్,యే ళ్ల బయన్న, మెండె వెంకన్న, పోకల కరుణాకర్, చెరుపల్లి శ్రీనివాస్, మిరియాల ప్రకాష్, అమరోజు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News