Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:25 PM

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య
07-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వీడియో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

కోదాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను మద్యం, ధన ప్రలోభాలతో ప్రభావితం చేస్తున్న కాంగ్రెస్ నాయకుల అక్రమాలను వీడియోల్లో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత హేయమైన, నీచమైన చర్యగా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కోదాడ నియోజకవర్గ నేత బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. ప్రజలకు నిజాలు తెలియకూడదనే భయంతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నమే ఈ దాడుల వెనుక ఉన్న అసలైన ఉద్దేశమని ఆయన ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాపై దాడులు చేయడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.కోదాడ నియోజకవర్గంలో జర్నలిస్టులపై జరిగిన ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న ఆయన, దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించి, ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోనుకాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను డిమాండ్ చేశారు.

మీడియా స్వేచ్ఛను కాపాడటం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ గుర్తు చేశారు.

Sthanikam

జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News