Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

జర్నలిస్టులపై దాడి

జర్నలిస్టులపై దాడి

జర్నలిస్టులపై దాడి
07-02-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

జర్నలిస్టులపై దాడి

డబ్బు పంపిణీ వీడియోలు చిత్రీకరించారనే ఆగ్రహంతో అభ్యర్థుల అనుచరుల ఘాతుకం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా డబ్బు పంపిణీ జరుగుతున్న దృశ్యాలను వీడియోల రూపంలో చిత్రీకరిస్తున్న జర్నలిస్టులపై అభ్యర్థుల అనుచరులు దాడికి పాల్పడిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.

ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు పంపిణీ చేస్తున్న దృశ్యాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో జర్నలిస్టులు వీడియోలు తీస్తుండగా,అడ్డుకునేందుకు కొందరు దుండగులు దాడి చేసి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ దాడిలో పలువురు జర్నలిస్టులు గాయపడినట్లు సమాచారం.

ఈ ఘటనకు నిరసనగా బాధిత జర్నలిస్టులు కోదాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై దాడి ప్రజాస్వామ్యానికి ముప్పు అని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఎన్నికల వేళ జర్నలిస్టులపై దాడులు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇలాంటి చర్యలను సహించబోమని జర్నలిస్టు సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Sthanikam

జర్నలిస్టులపై దాడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News