Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:53 PM

జర్నలిస్టులకు త్వరగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

30-01-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

జిల్లా అధ్యక్షులు గుండెగోని జయశంకర్.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో టీయూడబ్ల్యూజే (H-143) నిరంతరం కృషి చేస్తుందని, జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం తక్షణమే జారీ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు గుండగోని జయశంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చిట్యాల మండల కేంద్రంలోని బీఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే (H-143) చిట్యాల మండల నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా రేగొండ వేణుమాధవ్, ప్రధాన కార్యదర్శిగా చెన్నోజు చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడిగా అంతటి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారిగా బొడిగె విజయ్ కుమార్, కార్యదర్శిగా మూడ వెంకటాద్రి ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం గుండగోని జయశంకర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు కూడా వర్తింపజేయాలని కోరారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు మంజూరు చేసి, కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టుల అభ్యున్నతి, సమస్యల పరిష్కారానికి తమ యూనియన్ ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి, కార్యదర్శులు మూడ వేణు, చిరబోయిన మల్లేష్, TEMJU అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జానయ్య, నకిరేకల్ నియోజకవర్గం అధ్యక్షులు కొమ్ము యాదగిరి, ప్రధాన కార్యదర్శి శిరసు రమేష్, TEMJU నకిరేకల్ అధ్యక్షులు కొల్లోజు శ్రీకాంత్, బండారు చందు, కారంపూరి మధు, మారగోని శ్రవణ్, సంతోష్, దేశగాని సాయికుమార్, పల్లపు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టులకు త్వరగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News