Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:49 PM

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి.
February 22, 2026 05:59 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వృత్తిలో కొనసాగుతున్న వారందరికీ బే షరతుగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి.

టీజేయు మండల గౌరవ అధ్యక్షుడు నోముల రవీందర్ రెడ్డి

ఆత్మకూరు(ఎం): జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఆత్మకూరు(ఎం)మండల గౌరవ అధ్యక్షులు నోముల రవిందర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.శనివారం రోజు మండల కేంద్రంలోని టీజేయూ కార్యాలయంలో మాట్లాడుతూ... జర్నలిస్టులు సమాజంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ తమ వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తున్నారు. వృత్తి పరిరక్షణకు జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే మనుగడా సాధించగలుగుతారని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీజేయు అహర్నిశలు పాటుపడుతూ పోరాటాలు చేపడుతుందన్నారు. నేటి పరిస్థితులు చిన్న పత్రికలు మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారని అన్నారు. ప్రజల సమస్యలను ప్రతిబింబించే కథనాలు కవరేజీలను చేయడంలో తమ బాధ్యతను నెరవేర్చుతున్నారని తెలిపారు. ఈ క్రమంలో అనేక ఆటుపోట్లు ఎదురైన సమాజ హితం కోసం రాజీ పడకుండా వృత్తిని కొనసాగిస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు చిన్న చూపుగా వ్యవహరించడం జరిగింది ఈ విధానం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక పోషించిన జర్నలిస్టులకు అనేక హామీలు ఇచ్చిన గత(కిందటి) ప్రభుత్వం మోసగించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రెస్ అకాడమీ ప్రత్యేక చొరవ కనపర్చాలన్నారు.ప్రభుత్వం జర్నలిస్టులపై దాడుల నియంత్రణకై పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అక్రిడేషన్ కార్డులు వృత్తిలో కొనసాగుతున్న ప్రతి జర్నలిస్టుకు బేసరుతుగా జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ జిల్లా స్థాయి కమిటీల సూచనలు తప్పనిసరిగా పరిగణించి ఏం ఫైనల్లో చేర్చాలన్నారు. ఇండ్ల స్థలాలు,ఇండ్ల మంజూరు చేయాలన్నారు.జర్నలిస్టులకు ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి టీజేయు భవిష్యత్తు కార్యచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుందన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి సాధించుకోవాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News