జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరిన టీడబ్యూజేఎఫ్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరిన టీడబ్యూజేఎఫ్
Editor Desk
అబ్దుల్లాపూర్ మెట్టు, : జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీడబ్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవ పున్నయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ప్రభుత్వ అధికారుల హెల్త్ స్కీంలో జర్నలిస్టులను చేర్చాలని కోరారు.
సోమవారం అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలోని వి.వి. బ్యాంకెట్ హాల్‌లో నిర్వహించిన టీడబ్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు శేరిబాయి గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మైల సైదులు, కోశాధికారి శ్రీనివాస్ చారి, నేషనల్ కమిటీ సభ్యుడు దేవేందర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బసవ పున్నయ్య మాట్లాడుతూ వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి అర్హులైన వారందరికీ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫీల్డ్ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రభుత్వ అధికారులకు అమలు చేస్తున్న హెల్త్ స్కీంలో జర్నలిస్టులను కూడా చేర్చాలని సూచించారు. అలాగే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులతో పాటు రంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల వివరాలు సేకరించి ఫ్యూచర్ సిటీలో ఇండ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జర్నలిస్టుల పిల్లలకు విద్యా రాయితీలు కల్పించాలని, ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ అమలు చేసేలా జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి. వెంకటేశ్, మణికుమార్ , రఘునంధన్ గౌడ్, సుధర్శన్ గౌడ్, శ్రీనివాస్ , నర్సింహ్మ, రాజశేఖర్ , రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యాదగిరి, జిల్లా ప్రచార కార్యదర్శి నర్సింహ్మరెడ్డి, సోషల్ మీడియా కమిటీ కన్వీనర్ పులిపలుపుల శివ కుమార్ గౌడ్ , జిల్లా కమిటీ సభ్యులు శ్రీశైలం, అంజి, నియోజకవర్గాల అధ్యక్ష, కార్యదర్శులు యాదగిరి, రాఘవేందర్ గౌడ్, రాజు, జైచందర్ , శంకర్, బుచ్చయ్య, జర్నలిస్టులు, తెలుసూరి మల్లేష్, కొండ మల్లేశం గౌడ్ యకుబ్ పాష, తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి