Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:51 AM

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

11-04-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కమిటీ సభ్యులను సన్మానించిన రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని కృష్ణానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జానయ్యతో పాటు నూతన కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి విలువలతో కూడిన జర్నలిజం అవసరమని అన్నారు. ప్రభుత్వం మరియు ప్రజల మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులు బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండటంతో జర్నలిజం స్వరూపం మారిపోయిందని, నిజమైన విలువలు కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జర్నలిజం రక్షణ కోసం సంఘటిత కృషి అవసరమని అన్నారు.

ఇళ్ల స్థలాలు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమా, గుర్తింపు కార్డులు వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలో స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించిన స్థలంలో ఆయన పేరుతో పత్రికా భవనం నిర్మాణానికి సహకరిస్తానని తెలిపారు.అనంతరం జిల్లా కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లింగాల సాయిబాబా, శ్రీరాముల కృష్ణ, నందిపాటి సైదులు, గూడపూరి ప్రభాకర్, దోసపాటి అజయ్ గౌడ్, కొంగల సతీష్, నాగరాజు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News