Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:11 AM

జర్నలిస్టులకు టీజేఎఫ్ అండ… ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు, కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జర్నలిస్టులకు టీజేఎఫ్ అండ… ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు, కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జర్నలిస్టులకు టీజేఎఫ్ అండ… ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో నూతన సంవత్సర వేడుకలు, కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
January 01, 2026 06:27 PM 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం, స్థానికం రిపోర్టర్ జనార్ధన్

జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా, ఎంతటి కష్టం ఎదురైనా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీజేఎఫ్) అండగా నిలుస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోటి ఆదినారాయణ స్పష్టం చేశారు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో న్యూ ఇయర్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆకుతోటి ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి రమేష్ బాబు న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.

అనంతరం గుద్దేటి రమేష్ బాబు అధ్యక్షతన ప్రెస్ క్లబ్ (టీజేఎఫ్) కమిటీ మహాసభ జరిగింది. ఈ సభలో మాట్లాడిన ఆకుతోటి ఆదినారాయణ, ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో యూనియన్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు వంటి అంశాల్లో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పాలకుల ద్వంద వైఖరిని ప్రశ్నిస్తూ హక్కుల సాధన కోసం ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పారు. రానున్న ఆందోళన కార్యక్రమాల్లో జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ కమిటీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రెస్ క్లబ్ మరింత సుందరంగా మారిందని, ఇదే సమిష్టి కృషితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

ఈ మహాసభలో ఖమ్మం ప్రెస్ క్లబ్ (టీజేఎఫ్) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా గుద్దేటి రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా కొరకొప్పల రాంబాబు, కోశాధికారిగా బిక్కీ గోపి తిరిగి రెండోసారి ఎన్నికయ్యారు.

ఉపాధ్యక్షులుగా ముత్యాల కోటేశ్వరరావు, పోన్నేబోయిన పానకాలరావు, వి5 యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎస్. వెంకట్ రెడ్డి, సహాయ కార్యదర్శులుగా మూల జీవన్ రెడ్డి, ఉల్లోజు రమేష్, దండాల ప్రభాకర్ రెడ్డి, ప్రచార కార్యదర్శులుగా నల్లమోతు శ్రీనివాస్, కూరపాటి నరేష్, పులి శ్రీను ఎన్నికయ్యారు.

ఈసీ మెంబర్లుగా ఎ. మురళి, లక్ష్మణ్, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, శంకర్, అప్పారావు, విశ్వసేన రవీందర్, రోసిరెడ్డి, శ్రీధర్, రాజేంద్రప్రసాద్‌లతో పాటు మొత్తం 21 మందితో నూతన కమిటీ ఏర్పాటైంది.ఈ కార్యక్రమంలో టీజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మందులు ఉపేందర్, నగర కమిటీ ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, సంతోష్, మహిళా ప్రతినిధి వంగూరి ఈశ్వరి, గోవింద్, నాయకులు పెంటి వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, నాగరాజు, ఐలయ్య, ప్రసాద్, ఆదినారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News