Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:21 PM

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....

31-12-2025 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి....

సూర్యాపేట స్థానిక ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల హక్కులను కాలరాయద్దని మాజీ మంత్రి సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.సమాజ సేవకులుగా పేరొందిన జర్నలిస్టులు అటు ప్రభుత్వాలకు,ఇటు ప్రజలకు వారధిగా పనిచేసే గొప్ప వ్యక్తులని అన్నారు.అటువంటి జర్నలిస్టులను వర్గాలుగా చీల్చి అవమానించ వద్దని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు నూతనంగా జారీ చేయనున్న అక్రిడేషన్ కార్డుల ప్రక్రియ కోసం జారీ చేసిన జీవో నెం.252 ను సవరించేందుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీయూడబ్ల్యూజే (హెచ్–143) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి,జీవో 252 లోని నిబంధనలను సవరించి న్యాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇంతకాలం ఏకతాటిపై ఉన్న జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులు,డెస్క్ జర్నలిస్టులు అనే రెండు వర్గాలుగా చేసి తారతమ్యాలు చూపడం సరికాదన్నారు. గతoలో 239 జీవో ప్రకారం 23 వేల అక్రెడిటేషన్ కార్డులు రాగా, ప్రస్తుతం ప్రభుత్వం నూతనoగా తీసుకొచ్చిన 252 జీవో ప్రకారంతో పోలిస్తే సుమారు 13 వేల అక్రెడిటేషన్ కార్డులు జర్నలిస్టులు కోల్పోతున్నారని, ఇప్పుడు వారంతా ఎటు పోవాలని ప్రశ్నించారు.ప్రస్తుత జీవోను ప్రభుత్వం పునరాలోచిoచి తక్షణమే సవరణ చేయాలని డిమాండ్ చేశారు.లేని యెడల అసెంబ్లీ జర్నలిస్టుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. వినతి పత్రం అందజేసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షులు వజ్జ వీరయ్య యాదవ్‌,బొజ్జ ఎడ్వర్డ్,చల్లా చంద్రశేఖర్, ఊటుకురి రవీందర్, పెద్దింటి శ్యాం సుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్ వల్దాస్ ప్రవీణ్, యాకయ్య బచ్చు పురుషోత్తం, రామచారి, సతీష్, పిన్నెల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల హక్కులను ప్రభుత్వం కాలరాయద్దు....

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News