Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:15 PM

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన

27-12-2025 141 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌కు జీవో 252పై నిరసన

సూర్యాపేట స్థానికం ప్రతినిధి

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన అక్రిడిటేషన్ జీవో 252 జర్నలిస్టుల హక్కులను కాలరాస్తుందని టియుడబ్ల్యూజె(H-143) జిల్లా అధ్యక్షుడు వజ్జె వీరయ్య యాదవ్ శనివారం విమర్శించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిర్వహించిన నిరసనలో ఆయన, జర్నలిస్టులకు అన్యాయం చేసే విధంగా జీవో రూపొందించబడిందని తెలిపారు.

గతంలో డెస్క్ జర్నలిస్టులు మరియు సాధారణ జర్నలిస్టులందరికీ ఒకే విధంగా ఉన్న అక్రిడిటేషన్ కార్డులను, తాజాగా డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు, సాధారణ జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డు పేరిట వేరు చేస్తూ హక్కులను పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్డుతో ఏ ప్రయోజనం ఉంటుందో స్పష్టత ఇవ్వక పోవడం, అక్రిడిటేషన్ కార్డుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని దృష్టి సారించారు.

జర్నలిస్టులకు ప్రయోజనకరంగా జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ, వజ్జె వీరయ్య యాదవ్ ఏవోకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గుండా శ్రీనివాస్ గుప్తా, హరి కిషన్, బొజ్జ ఎడ్వర్డ్, చల్లా చంద్రశేఖర్, ఊటుకూరి రవీందర్, రాపర్తి మహేష్, పెద్దింటి శ్యాంసుందర్ రెడ్డి, గుణగంటి సురేష్, అమరగాని నాగేందర్, వల్దాస్ ప్రవీణ్, ఫణీంద్ర, సైదిరెడ్డి, చారి, యాకయ్య, పురుషోత్తం, అయినాల శ్రీనివాస్, వీరన్న నాయక్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో 252కు సూర్యాపేటలో నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News