Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

జనరల్ చైర్మన్ స్థానాలు బీసీలకే కేటాయించాలి…

12-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

బీసీ జనాభా 56 శాతం ఉన్న నేపథ్యంలో న్యాయమైన ప్రాతినిధ్యం ఇవ్వాలని డిమాండ్

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లావ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన మున్సిపల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ కేటగిరీగా కేటాయించిన చైర్మన్ స్థానాలను బీసీలకే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీల శాతం 56 శాతం ఉన్నట్లు అధికారికంగా వెల్లడించిందని ఆయన గుర్తుచేశారు. అలాంటి పరిస్థితిలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ,టికెట్ల కేటాయింపులో ఆ హామీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.కనీసం జనరల్ కేటగిరీగా ప్రకటించిన చైర్మన్ స్థానాల్లోనైనా బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది కేవలం రాజకీయ డిమాండ్ మాత్రమే కాకుండా,సామాజిక న్యాయం సాధనలో ఒక అవసరమైన అడుగు అని కొత్త నరసింహస్వామి స్పష్టం చేశారు.బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాతినిధ్యం కల్పించకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుందని హెచ్చరించారు. సామాజిక న్యాయం, సమాన హక్కులు అనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రభుత్వం ఆచరణలో చూపాలని ఆయన కోరారు.

Sthanikam

జనరల్ చైర్మన్ స్థానాలు బీసీలకే కేటాయించాలి…

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News