Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:44 AM

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు

10-03-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలోని స్మశాన వాటికలో నీటి సదుపాయం కల్పించేందుకు బోరు బావి ఏర్పాటు పనులు చేపట్టారు. మండల టిడిపి మహిళా అధ్యక్షురాలు మదాసు చంద్రకళ, గ్రామ టిడిపి అధ్యక్షుడు మదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో మంజూరైన నిధులతో బోరు డ్రిల్లింగ్ పనులు చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

స్మశాన వాటికలో నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని ఈ బోరు బావి ఏర్పాటు చేయడం గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు మంత్రి కొలుసు పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ నీటి సంఘం అధ్యక్షుడు వంగల సుబ్బారావు, గ్రామ టిడిపి ప్రధాన కార్యదర్శి బలువూరి రత్తయ్య, కోశాధికారి కాసగాని గోపాలస్వామి, కార్యనిర్వహణ కార్యదర్శి వంగల రమేష్, తెలుగు యువత కార్యదర్శి దార మురళీ, బూత్ కన్వీనర్ చీపు రామారావు, నాయకులు బొరిగొర్ల తిరపతిరావు, చీపు రాఘవేంద్రరావు, రాచకొండ కృష్ణ, బెజవాడ శ్రీనివాసరావు, బొట్ల శ్రీనివాసరావు, చీపు వెంగళరావు, శ్రావణపల్లి నాగేశ్వరరావు, చీపు మల్లేశ్వరరావు, కాసగాని చెన్నారావు, కొత్తపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనార్ధనవరం గ్రామ స్మశాన వాటికలో బోరు బావి ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News