Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:34 AM

జననాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా చాట్రాయి లో ఘనంగా నిర్వహణ

24-01-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చా ట్రాయి జనవరి 24(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయిలో సామాజిక న్యాయ పోరాట యోధుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారత రత్న కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ ఏలూరు జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి ఆదిమూలం నాగమోహన్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కర్పూరీ ఠాకూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిమూలం నాగమోహన్ శర్మ మాట్లాడుతూ

అణగారిన వర్గాల ఆశాజ్యోతి సమాజంలో వెనుకబడిన, దళిత, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు కర్పూరీ ఠాకూర్ అని కొనియాడారు.ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'భారత రత్న' ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆయన జీవితం నేటి తరం నాయకులకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు ఇజ్జగిరి నరసింహ రావు, ఆదిములం హేమంత్, బొర్రాశేఖర్, మరియు గ్రామ ప్రముఖులు పాల్గొని కర్పూరీ ఠాకూర్ కి నివాళులర్పించారు

Sthanikam

జననాయక్ కర్పూరీ ఠాకూర్ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా చాట్రాయి లో ఘనంగా నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News