Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:25 AM

జనగణన వివరాలు పూర్తిగా గోప్యం – కలెక్టర్ ప్రతీక్ జైన్

12-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జనగణన ప్రతి పౌరుడి బాధ్యత అని, సమగ్ర మరియు ఖచ్చితమైన సమాచారం దేశాభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పేర్కొన్నారు. జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మంగళవారం జిల్లా కలెక్టరేట్ నుంచి ఐబీ వరకు నిర్వహించిన “జనగణన అవగాహన మారథాన్ వాక్” కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మే 10 వరకు స్వీయ గణన నిర్వహించగా, మే 11 నుంచి ఇంటింటి గణన ప్రారంభమైందన్నారు. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారని, వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రజలు జనగణన సిబ్బందికి సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు. జనగణనలో సేకరించే సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుందని స్పష్టం చేశారు. ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఏర్పడి, సంక్షేమ పథకాల రూపకల్పన మరియు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు జనగణన గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని జనగణన విజయవంతానికి సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, వివిధ శాఖల అధికారులు, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది, తహసీల్దార్లు, ఎన్యూమరేటర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనగణన వివరాలు పూర్తిగా గోప్యం – కలెక్టర్ ప్రతీక్ జైన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News