Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం
23-05-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మనోవేదన, ఆర్థిక ఇబ్బందులతోనే ఘటన?

జనగామ జిల్లాలో తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఆచార్యులు ఆలయ కోనేరులో పడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నెల రోజుల క్రితం భార్య మృతి చెందడంతో లక్ష్మీనరసింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు

Sthanikam

జనగామలో తండ్రీకొడుకుల ఆత్మహత్య కలకలం. ఆలయ కోనేరులో దూకి బలవన్మరణం

Article Image

మనోవేదన, ఆర్థిక ఇబ్బందులతోనే ఘటన?

జనగామ జిల్లాలో తండ్రీకొడుకుల ఆత్మహత్య ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. బండగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్న లక్ష్మీనరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌కుమార్ ఆచార్యులు ఆలయ కోనేరులో పడి మృతిచెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. నెల రోజుల క్రితం భార్య మృతి చెందడంతో లక్ష్మీనరసింహాచార్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని, ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతున్న నేపథ్యంలో ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్ పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News