Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:44 AM

జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు

జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు

జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు
22-01-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భక్తుల సౌకర్యార్థం కోదాడ డిపో చర్యలు

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉరుసు సందర్భంగా భక్తుల ప్రయాణ సౌకర్యార్థం కోదాడ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సు సేవలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రత్యేక బస్సు సేవలు జనవరి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. నేరేడుచర్ల నుంచి జాన్ పహాడ్ దర్గా వరకు ప్రతి ఇరవై నిమిషాలకు ఒక బస్సు చొప్పున నడపనున్నట్లు తెలిపారు.

భక్తులకు అందుబాటులో ఉండేలా చార్జీలను తక్కువగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. పెద్దలకు యాభై రూపాయలు, పిల్లలకు ముప్పై రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. జాన్ పహాడ్ ఉరుసుకు వచ్చే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే ఈ ప్రత్యేక బస్సు సేవల ప్రధాన ఉద్దేశమని కోదాడ డిపో అధికారులు తెలిపారు.భక్తులు అధిక సంఖ్యలో ఈ ప్రత్యేక బస్సు సేవలను వినియోగించి, ఈ సేవలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు.

Sthanikam

జాన్ పహాడ్ ఉరుసుకు ప్రత్యేక బస్సు సేవలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News