Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:20 PM

జాన్ పహాడ్ దర్గా ఉర్సు మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి

14-01-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

పాలకవీడు మండలంలో జనవరి 23, 24, 25 తేదీల్లో జరగనున్న జాన్ పహాడ్ దర్గా ఉర్సు మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం పాలకవీడు మండల కేంద్రంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా గతంలో మాదిరిగానే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలకు సరిపడా బాత్రూమ్ సదుపాయాలు, త్రాగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఉర్సు సందర్భంగా ఏర్పాటు చేసే షాపులు, స్పోర్ట్స్, స్టాళ్ల వద్ద ధరల పట్టికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని, అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే శూన్య పహాడ్ రోడ్డును మరమ్మతులు చేయాలని సూచించారు. పోలీస్ శాఖ భక్తులకు వాహనాల రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రామపంచాయతీలు, ఏపీఓలు, ఎంపీడీవోలు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ట్యాంకర్లు, ట్రాక్టర్ల సహాయంతో త్రాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ భక్తుల కోసం తగిన లైటింగ్ ఏర్పాట్లు చేయాలని, గంధం ఊరేగింపులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపుల వద్ద భద్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆరోగ్య శాఖ తాత్కాలిక హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.

ఈ సమావేశంలో మరుగుదొడ్లు, పారిశుధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్ నియంత్రణ, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సేవలు తదితర అంశాలపై అన్ని శాఖలకు స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

జాన్ పహాడ్ దర్గా ఉర్సు మహోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News