Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ

07-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి/సోమందేపల్లి : రాష్ట్రంలో నీటి సంరక్షణకు ‘జలధార’ ఉద్యమాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామ సమీపంలోని చెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీతలు, మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యమన్నారు. ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

జలధార కార్యక్రమం అనంతరం మంత్రి వేరుశెనగ పంట పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించారు. పంటల పరిస్థితి, దిగుబడిపై వివరాలు తెలుసుకుని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అమరావతి అంశంపై వైసీపీ నేతల వైఖరిని ఆమె విమర్శిస్తూ, మీడియా సంస్థలు, ప్రజలపై దాడులు గర్హనీయమని హెచ్చరించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

జలధార’తో నీటి సంరక్షణకు వందరోజుల కార్యాచరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News