Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:34 AM

జల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే

జల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే

జల పక్షాన పోరాటాలు చేసేది సిపిఐ పార్టీ మాత్రమే
January 02, 2026 07:29 PM 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సిపిఐ పార్టీలో 15 కుటుంబాల చేరిక

స్థానికం ప్రతినిధి బిక్షం

తిరుమలగిరి :

జల, కార్మిక, రైతు సమస్యలపై ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటాలు చేస్తున్న పార్టీ సిపిఐ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. జనవరి 18వ తేదీన ఖమ్మం నగరంలో జరగనున్న సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శుక్రవారం తిరుమలగిరి మండలం మావిడాల గ్రామ ఎక్స్‌రోడ్ వద్ద తిరుమలగిరి–తుంగతుర్తి మండల సమితి సమావేశం తిరుమలగిరి, తుంగతుర్తి మండల కార్యదర్శులు ఫయాజ్, పాల్వాయి పున్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బెజవాడ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, 1925 డిసెంబర్ 26న స్థాపితమైన భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ద కాల ఉద్యమ చరిత్రలో అనేక నిర్బంధాలు, దాడులను ఎదుర్కొంటూ ప్రజల హక్కుల కోసం పోరాడిందని తెలిపారు.

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, దొరలు–భూస్వాముల గడిలను బద్దలు కొట్టడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ పోరాడుతోందన్నారు. ప్రజాస్వామిక హక్కుల సాధన కోసం పార్టీ ఎప్పటికీ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుత కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికులు శతాబ్ద కాలంగా సాధించుకున్న ఎనిమిది గంటల పని హక్కును నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక హక్కులను హరిస్తోందని విమర్శించారు. అలాగే పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పేద ప్రజలకు పని లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుర్మార్గ, ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగుతాయని, ఆ పోరాటాలలో ప్రజలు భాగస్వాములై విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కోక్యతాండ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు సంబంధించి 15 కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు సమక్షంలో సిపిఐ పార్టీలో చేరాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, తుంగతుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లంల యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైజర్ కార్యదర్శి గుగులోతు రాజారాం, ఎస్.కే.ఏక్‌బాల్, త్రిపురాల శ్రీకాంత్, జంపాల మల్లయ్య, ఇస్లావత్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News