Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:26 AM

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

29-12-2025 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యూరియా సరిపోతుంది… రైతులకు కలెక్టర్ భరోసా

యాదాద్రి స్థానికం ప్రతినిధి

యూరియా కొరతపై జిల్లాలో నెలకొన్న అపోహలకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పష్టమైన తెరదించారు. సాగుకు అవసరమైన యూరియా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం జిల్లాలో 6,191 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, ఇప్పటివరకు మొత్తం 15,611 మెట్రిక్ టన్నుల యూరియాను జిల్లాకు సరఫరా చేసినట్లు తెలిపారు. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సరఫరాలు కూడా క్రమం తప్పకుండా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రతి సేల్ కౌంటర్ వద్ద షామియానా, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉదయం 6 గంటల నుంచే యూరియా విక్రయాలు ప్రారంభించాలని సూచించారు.

యూరియా పంపిణీపై వ్యవసాయ శాఖ, సంబంధిత అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించినా, అధిక ధరలకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

యూరియా సరఫరాలో ఎలాంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అవసరానికి మించి నిల్వ చేసుకోకుండా, శాస్త్రీయ పద్ధతిలో వినియోగించుకోవాలని రైతులకు కలెక్టర్ సూచన చేశారు.

Sthanikam

జిల్లాలో యూరియా కొరత లేదు – కలెక్టర్ స్పష్టం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News