Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:37 AM

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక

23-12-2025 194 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల సత్తా

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో రామన్నపేట క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను చాటుకున్నారు. వలిగొండ మండల కేంద్రంలో గత రెండు రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్‌లో పాల్గొన్న క్రిష్ణవేణి విద్యార్థులు అత్యుత్తమ ప్రాజెక్టులతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకుని జిల్లా స్థాయి ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించడంతో పాటు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు.

గ్రీన్ ఎనర్జీ జూనియర్ విభాగంలో వి. శరణ్ తేజ్ జిల్లా స్థాయి ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండెంట్ గంగుల నరేందర్ రెడ్డి తెలిపారు. సస్టైనబుల్ అగ్రికల్చర్ విభాగంలో బి. ప్రణీత్ రెడ్డి జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి పొందగా, హెల్త్ అండ్ హైజిన్ సీనియర్ విభాగంలో జి. లిఖిత జిల్లా స్థాయి ద్వితీయ బహుమతి సాధించింది. అలాగే వెస్ట్ టు వెల్త్ విభాగంలో ఏ. మాళవిక, ఎన్. అన్షు శ్రీలు జిల్లా స్థాయి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.

జిల్లా స్థాయి విజేతలకు జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి, జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ తమ చేతుల మీదుగా మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేశారు.

జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను, వారికి మార్గనిర్దేశం చేసిన గైడ్ టీచర్ మురళిని పాఠశాల ప్రిన్సిపాల్ బి. యాదగిరి, డైరెక్టర్ జెవిఎన్‌ఎస్ మణి, ఉపాధ్యాయ బృందం అభినందించింది.

Sthanikam

జిల్లా సైన్స్ ఫేర్‌లో క్రిష్ణవేణి విద్యార్థుల ప్రతిభ… రాష్ట్ర స్థాయికి ఎంపిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News