Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

జిల్లా ఎస్పీ ఆదేశాలతో క్యాబ్ డ్రైవర్లపై ఫోకస్ రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

07-01-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

క్యాబ్ డ్రైవర్లకు రోడ్డు భద్రతల గురించి సూచిస్తున్న సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్లు, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ, క్యాబ్ డ్రైవర్లు ప్రతిరోజూ అనేకమంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని తెలిపారు. అందువల్ల ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, వేగ నియంత్రణ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. అలాగే వాహనాల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో క్యాబ్ డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

Sthanikam

జిల్లా ఎస్పీ ఆదేశాలతో క్యాబ్ డ్రైవర్లపై ఫోకస్ రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం

Article Image

క్యాబ్ డ్రైవర్లకు రోడ్డు భద్రతల గురించి సూచిస్తున్న సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సూర్యాపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో క్యాబ్ డ్రైవర్లను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో బుధవారం జరిగింది. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్యాబ్ డ్రైవర్లు, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం మాట్లాడుతూ, క్యాబ్ డ్రైవర్లు ప్రతిరోజూ అనేకమంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని తెలిపారు. అందువల్ల ట్రాఫిక్ నిబంధనలను కట్టుదిట్టంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని, వేగ నియంత్రణ పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. అలాగే వాహనాల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో క్యాబ్ డ్రైవర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News