Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం

08-05-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రైతులకు ఉచిత వైద్య సేవలు.. 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాల పంపిణీ

చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం (కాటిల్ ఫెర్టిలిటీ క్యాంప్) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, గ్రామ సర్పంచ్ సమ్మిరెడ్డి భారతమ్మ జనార్ధన్ రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ చెన్నగోని అంజయ్య ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.శిబిరంలో ఆవులు, గేదెలకు పశువైద్యాధికారులు గర్భకోశ పరీక్షలు నిర్వహించి రైతులకు అవసరమైన ఉచిత మందులను పంపిణీ చేశారు. దూడలకు నట్టల నివారణ మందులు వేయడంతో పాటు వాటి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ‘కాఫ్ ర్యాలీ’ నిర్వహించారు.పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా రైతులకు 75 శాతం సబ్సిడీతో పశుగ్రాస విత్తనాలను అందజేశారు. వేసవి కాలంలో పశువుల సంరక్షణ, పోషణ, తాగునీటి నిర్వహణపై పశువైద్యాధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మిల్క్ సొసైటీ చైర్మన్ దిల్లి శేఖర్ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్ బోదాసు స్వాతి వెంకటేష్, పశువైద్యాధికారులు డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ పృథ్వీరాజ్, వార్డు సభ్యులు బిమిడి రజిత సందీప్, వార్డు సభ్యులు, పశువైద్య సిబ్బంది, జైకేసారం గ్రామానికి చెందిన పాడి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

జైకేసారంలో పశువుల పునరుత్పత్తి ఉత్పాదకత శిబిరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News