Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:23 AM

జహీరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర

09-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

మజ్లిస్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలుపు కోరిన ఎంఐఎం అధినేత

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పట్టణంలో ఆదివారం ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్‌తో పాటు పలు వార్డుల్లో ఆయన పాదయాత్ర నిర్వహించి, ఎంఐఎం అభ్యర్థుల తరఫున ప్రజలను ఓట్ల కోసం అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జహీరాబాద్ పట్టణంలో నెలకొన్న తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ, పేదల సంక్షేమం వంటి స్థానిక సమస్యల పరిష్కారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అభ్యర్థులతోనే సాధ్యమని పేర్కొన్నారు. మజ్లిస్ పార్టీ ప్రజల సమస్యలను ఎప్పుడూ పట్టించుకుంటూ, అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు.మున్సిపల్ ఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.

Sthanikam

జహీరాబాద్‌లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచార పాదయాత్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News