Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

21-05-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కర్నూలు: ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఖరిలో మార్పు రాలేదని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరితారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంతో ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ పెరిగిందన్నారు. ఆ అభివృద్ధిని చూసి జగన్ జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

అమరావతి, పోలవరం, రాయలసీమ ప్రాజెక్టులను జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు.

కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగరాజు యాదవ్, రాఘవేంద్రరెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జగన్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు: కొల్లు రవీంద్ర

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News