Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:23 AM

జగదాంబ సేవాలాల్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం – ఎమ్మెల్యే

09-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కొండాపూర్ మండలం శివన్న గూడెం తండాలోని జగదాంబ సేవాలాల్ ఆలయ 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు తండా ప్రజలు, యువకులు లంబాడ సంప్రదాయ వస్త్రధారణలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో లంబాడ సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ సందర్భంగా తండాలోని తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తండా ప్రజలు తనకు ఇచ్చిన మద్దతును గుర్తు చేసుకుంటూ తండా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. అలాగే జగదాంబ సేవాలాల్ ఆలయ అభివృద్ధికి కూడా తన వంతు సహాయం అందిస్తానన్నారు. ఆలయ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వినోద్, మండల పార్టీ అధ్యక్షుడు విఠల్, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, దేవేందర్, మల్లేశం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

జగదాంబ సేవాలాల్ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం – ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News