Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వర్షాభావ పరిస్థితుల్లో పత్తి పంటను కాపాడుకోండి: వ్యవసాయ అధికారి సంతోష్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:20 PM

జాతీయ స్థాయి లక్ష్యంగా ఖమ్మం మహిళల కబడ్డీ జట్టు

29-12-2025 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జాతీయ స్థాయి లక్ష్యంగా ముందుకు సాగాలి

ఖమ్మం మహిళల కబడ్డీ జట్టును అభినందించిన దయాకర్ రెడ్డి

ఖమ్మం: స్థానికం ప్రతినిధి

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటిన ఖమ్మం జిల్లా మహిళల కబడ్డీ జట్టు మరింత మెరుగైన ఆటతీరుతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి, ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు తుంబూరు దయాకర్ రెడ్డి ఆకాంక్షించారు.

కరీంనగర్‌లో ఈ నెల 25 నుంచి 28 వరకు కరీంనగర్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 72వ తెలంగాణ రాష్ట్రస్థాయి స్త్రీ, పురుషుల కబడ్డీ పోటీల్లో ఖమ్మం జిల్లా మహిళల జట్టు స్త్రీల విభాగంలో తృతీయ బహుమతి సాధించి కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సందర్భంగా సోమవారం మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులను దయాకర్ రెడ్డి అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, పట్టుదల ఉంటే ఖమ్మం క్రీడాకారిణులు రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ స్థాయిలోనూ ప్రతిభను చాటగలరని అన్నారు. ప్రభుత్వం, క్రీడా సంఘాల సహకారంతో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

డీ వై ఎస్ ఓ తుంబూరు సునీల్ రెడ్డి కూడా జట్టు సభ్యులను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల క్రిస్టాఫర్ బాబు, జట్టు కోచ్ శివజ్యోతి, మేనేజర్ శ్రీను, కబడ్డీ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారిణులను సన్మానించారు.

Sthanikam

జాతీయ స్థాయి లక్ష్యంగా ఖమ్మం మహిళల కబడ్డీ జట్టు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News