Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:43 AM

జాతీయ లోక్ అదాలత్‌లో నారాయణఖేడ్‌లో 316 కేసులకు పరిష్కారం

21-12-2025 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి

నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆదివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఖేఢ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 316 కేసులకు పరిష్కారం లభించింది.

ఈ సందర్భంగా న్యాయమూర్తి మంథని శ్రీధర్ మాట్లాడుతూ, వీటిలో 316 కేసులు రాజీ మార్గం ద్వారా పరిష్కారమయ్యాయని తెలిపారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యంగా జాతీయ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తున్నామని, కోర్టుల భారం తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ఖర్చు ఆదా అవుతుందన్నారు.

రాజీ మార్గంతో వివాదాలను పరిష్కరించుకోవడం వల్ల ఇరు పక్షాలకు మేలు జరుగుతుందని పేర్కొంటూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భోజిరెడ్డి, న్యాయవాదులు మారుతి రెడ్డి సహా పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

జాతీయ లోక్ అదాలత్‌లో నారాయణఖేడ్‌లో 316 కేసులకు పరిష్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News