నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రంలో శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఛార్జ్ ఆఫీసర్ & తహసీల్దార్ విష్ణు సాగర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మే 11వ తేదీ సోమవారం నుండి మనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి కుటుంబ మరియు ఇంటి వివరాలను సేకరిస్తారని, ప్రజలు వారికి సరైన సమాచారం అందించి పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామాలలో చాటింపులు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనగణన ప్రభుత్వ ముఖ్య కార్యక్రమమని, మనూర్ మండల ప్రజలందరూ బాధ్యతగా భావించి ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ విష్ణు సాగర్ విజ్ఞప్తి చేశారు.
PRINT TIME: August 31, 2026 09:22 AM
ఇంటింటికీ జనగణన సర్వే – సరైన సమాచారం ఇవ్వాలి

09-05-2026
57 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండల కేంద్రంలో శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఛార్జ్ ఆఫీసర్ & తహసీల్దార్ విష్ణు సాగర్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, మే 11వ తేదీ సోమవారం నుండి మనూర్ మండలంలోని అన్ని గ్రామాలలో జనగణన కార్యక్రమంలో భాగంగా మొదటి దశ ఇండ్ల గణన కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వచ్చి కుటుంబ మరియు ఇంటి వివరాలను సేకరిస్తారని, ప్రజలు వారికి సరైన సమాచారం అందించి పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే పంచాయతీ కార్యదర్శులు తమ తమ గ్రామాలలో చాటింపులు వేయించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జనగణన ప్రభుత్వ ముఖ్య కార్యక్రమమని, మనూర్ మండల ప్రజలందరూ బాధ్యతగా భావించి ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ విష్ణు సాగర్ విజ్ఞప్తి చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి