Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

ఇంటింటి ప్రచారంతో ప్రజల హృదయాలు గెలిచిన కాంగ్రెస్

08-02-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగర్ శెట్కార్ తరపున జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాకేష్ షేట్కార్ కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డు పరిధిలో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు.ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉందని తెలిపారు.7వ వార్డు అభివృద్ధి కోసం స్పష్టమైన దృక్పథంతో ముందుకు వెళ్తున్న నాయకుడు సాగర్ శెట్కార్ అని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వార్డు సమస్యలపై నిరంతరం పోరాడే వ్యక్తిగా ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.నారాయణాఖేడ్ మున్సిపాలిటీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజల సహకారంతో ప్రతి వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి లభించిన స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శంకరాయ్యస్వామి, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాహిర్ అలీ, బీసీ అధ్యక్షులు సాయిలు పటేల్, రామకృష్ణ, దత్తు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఇంటింటి ప్రచారంతో ప్రజల హృదయాలు గెలిచిన కాంగ్రెస్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News