Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:45 AM

ఇంటి వద్దే ఫిర్యాదు.. జిల్లాలో తొలి కేసు నమోదు

22-01-2026 193 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా పోలీసుల వినూత్న కార్యాచరణకు శ్రీకార

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

బాధితుల ఇంటి వద్దకే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసే నూతన కార్యాచరణలో భాగంగా సూర్యాపేట జిల్లాలో తొలి కేసును నడిగూడెం పోలీసులు నమోదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వికలాంగురాలు భూమా రమాదేవి తన భర్త వేధింపులు, కొట్టడం చేస్తున్నాడని డయల్ వందకు ఫోన్ చేయగా, సమాచారం అందుకున్న నడిగూడెం ఎస్‌ఐ అజయ్ కుమార్ సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లారు. అక్కడే ఆమె ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసి, ఫిర్యాదు ప్రతిని బాధితురాలికి అందజేశారు. ఇంటి వద్దే కేసు నమోదు కార్యక్రమం ద్వారా మహిళలు, పిల్లలు, వృద్ధులపై దాడులు, వేధింపులు, దొంగతనాలు, బాల్య వివాహాలు వంటి ఘటనల్లో బాధితులకు భరోసా కలుగుతుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, బాధితుల ఇంటికే వెళ్లి కేసులు నమోదు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

జిల్లాలో తొలి కేసు నమోదు చేసిన నడిగూడెం పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

Sthanikam

ఇంటి వద్దే ఫిర్యాదు.. జిల్లాలో తొలి కేసు నమోదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News