Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

19-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

Telangana State Board of Intermediate Education ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి ఆధ్వర్యంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు శిక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ అధ్యక్షత వహించగా, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రమణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సమగ్రంగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని 28 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, సరైన వెలుతురు, ప్రతి తరగతి గదిలో గోడ గడియారాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని,జిల్లా పరీక్షల కమిటీ, కన్వీనర్, డిస్ట్రిక్ట్ బల్క్ ఫ్లైయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్‌లను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News