Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపాలి

ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపాలి

ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపాలి
24-02-2026 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిపో మేనేజర్‌కు వినతి

ఈనెల 25 నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సమయానుకూలంగా బస్సు సౌకర్యం కల్పించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు దాసరి ప్రకాష్ మాట్లాడుతూ, పల్లెల నుంచి పట్టణాల వరకు పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని కోరారు. కొన్ని గ్రామాలకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యేంత వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, అవసరమైన చోట్ల అదనపు సర్వీసులు నడపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రధాన రహదారులపై ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సులు కూడా ఆపి విద్యార్థులకు సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షుడు శ్రావణ్, నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడపాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News