Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

ఇసుక దోపిడీకి చెక్‌ చిర్రగూడూర్ అభివృద్ధే లక్ష్యం

28-12-2025 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

నూతన సర్పంచ్ చిత్తలూరి సోమనారాయణ

స్థానికం ప్రతినిధి బిక్షం

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని చిర్రగూడూర్ గ్రామంలో నూతన సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికై గెలుపొందిన చిత్తలూరి సోమనారాయణ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ శుభాభివందనాలు తెలిపారు. తనను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

చిర్రగూడూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నిలిచిపోయిన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామ ప్రజల సహకారంతో ఘనంగా నిర్వహించి బొడ్రాయి పండుగ జరుపుతామని చెప్పారు.

గ్రామంలో గత పాలకుల హయాంలో జరిగిన ఇసుక దోపిడీని ఎమ్మెల్యే మందుల సామేలు సహకారంతో పూర్తిగా అరికడతామని స్పష్టం చేశారు. గ్రామ అవసరాలకు తప్ప ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తే ఊరుకునేది లేదన్నారు. గ్రామంలో సుమారు 40కి పైగా ట్రాక్టర్లు ఉన్నాయని, ఏ ఒక్క ట్రాక్టర్ ద్వారా అక్రమంగా ఇసుక తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని తెలిపారు. జానకిపురం నుంచి చిర్రగూడూర్ వరకు ఉన్న లింక్ రోడ్డును ఎమ్మెల్యే సహకారంతో బీటీ రోడ్డుగా పూర్తి చేస్తామని అన్నారు. గ్రామ ప్రజల సహకారంతో చిర్రగూడూర్‌ను మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

చదువులో ముందుండే విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి అండగా ఉంటానని, గ్రామ యువకుల సహకారంతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గ్రామపంచాయతీకి పక్కా భవనం లేకపోవడంతో, ఎమ్మెల్యే సహాయంతో ఆధునిక సదుపాయాలతో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు.

గత పాలకులు రైతులను ఇబ్బందులకు గురిచేసి నాయకులు లబ్ధి పొందారని విమర్శించారు. ఇకపై రైతులను ఇబ్బంది పెట్టే ఎలాంటి అక్రమాలకు అవకాశం ఇవ్వబోమని, ఇసుక దోపిడీని పూర్తిగా అరికడతామని చిత్తలూరి సోమనారాయణ స్పష్టం చేశారు.

Sthanikam

ఇసుక దోపిడీకి చెక్‌ చిర్రగూడూర్ అభివృద్ధే లక్ష్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News