Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయని వ్యవహారం – కలెక్టర్‌కు కారాగార శిక్ష

18-02-2026 346 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ హై కోర్టు ధిక్కరణను తీవ్రంగా పరిగణిస్తూ, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఆరు నెలల కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ అధికారులపై న్యాయస్థాన ఆదేశాలను అమలు చేయకపోతే ఎంత కఠిన చర్యలు తీసుకోబడతాయో ఈ తీర్పు స్పష్టం చేసింది.వివరాల్లోకి వెళ్తే, చేగుంట మండలం పరిధిలోని బోనాల గ్రామంలో భూ వివాదం విషయంలో ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేసి, చట్టబద్ధంగా విచారణ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ ఆదేశాలను అమలు చేయకుండా, తగిన ఆధారాలు లేకుండానే దరఖాస్తును తిరస్కరించడం పట్ల న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.న్యాయమూర్తి కె. లక్ష్మణ్ తన తీర్పులో కలెక్టర్ ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థాన ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం చేయడం, న్యాయస్థాన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించడం ప్రతి అధికారికి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని స్పష్టం చేశారు.సాధారణంగా ధిక్కరణ కేసుల్లో హెచ్చరికలు లేదా జరిమానాలు విధించే సందర్భాలు ఉన్నప్పటికీ, ఈ కేసులో ఆరు నెలల కారాగార శిక్ష విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇది అధికార వ్యవస్థకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. న్యాయస్థాన ఆదేశాలు అమలు చేయడం ప్రతి అధికారికి తప్పనిసరి కర్తవ్యమని ఈ తీర్పు మరోసారి రుజువు చేసింది.

Sthanikam

ఇరుపక్షాలకు నోటీసులు జారీ చేయని వ్యవహారం – కలెక్టర్‌కు కారాగార శిక్ష

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News