Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:59 PM

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి – తిరువూరు లో సీపీఎం నిరసన

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి – తిరువూరు లో సీపీఎం నిరసన

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి – తిరువూరు లో సీపీఎం నిరసన
March 11, 2026 04:00 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్‌లో బుధవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. నాగేంద్రప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు ఎస్. నాగేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ధాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు తీవ్రమైన సంక్షోభంలో పడతాయని అన్నారు. అమెరికా యుద్ధోన్మాదం కారణంగా అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇప్పటికే యుద్ధ ప్రభావంతో కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడి పలు పెద్ద నగరాల్లో గ్యాస్ సంక్షోభం కనిపిస్తోందని పేర్కొన్నారు. పరిస్థితి మరింత విషమించేలోపు అమెరికా వెంటనే యుద్ధాన్ని ఆపాలని వారు డిమాండ్ చేశారు.

అలాగే భారత ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో స్నేహం భారతదేశానికి నష్టమని విమర్శించారు. ప్రపంచ దేశాలు యుద్ధాన్ని ముక్తకంఠంతో ఖండిస్తుండగా మోదీ మాత్రం దీనిపై స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎస్.వి. భద్రం, ఎస్. వెంకటేశ్వర్లు, ఆకుల రవి, బి. వెంకటేశ్వరావు, చప్పిడి సురేష్, పి. శ్రీనివాసరావు, షేక్ నాగులు మీరా, సిహెచ్. సత్యనారాయణ, ఎం. రాము, ఎం. నరసింహారావు, ఎం. తిరుపతిరావు, ఉమా, ఎం. ప్రకాష్ రావు, కే. వెంకటరత్నం, ఎం. ఇశ్రాయేలు, అలవాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News