Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తండ్రి ఆశయాలకు నిలువెత్తు నివాళిగా గ్రామంలో సిమెంట్ కుర్చీల ఏర్పాటు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 05:39 PM

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ దినోత్సవం ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ దినోత్సవం ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ దినోత్సవం ఘనంగా నిర్వహణ
May 09, 2026 03:18 AM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మానవత్వానికి ప్రతీక రెడ్‌క్రాస్ : అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి

భువనగిరి

అంతర్జాతీయ రెడ్‌క్రాస్ దినోత్సవాన్ని శుక్రవారం భువనగిరి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యునాంట్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకంతో పాటు రెడ్‌క్రాస్ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 1863లో హెన్రీ డ్యునాంట్ స్థాపించిన రెడ్‌క్రాస్ సంస్థ మానవత్వానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు, అంటువ్యాధుల సమయంలో కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా బాధితులకు సేవలందించడం అభినందనీయమన్నారు. మానవత్వం, నిష్పాక్షికత, తటస్థత, స్వాతంత్ర్యం, స్వచ్ఛంద సేవ, ఐక్యత, సార్వత్రికత అనే ఏడు ప్రాథమిక సూత్రాలతో రెడ్‌క్రాస్ వాలంటీర్లు సేవలు అందిస్తున్నారని కొనియాడారు.

కోవిడ్ మహమ్మారి సమయంలో, వరదల సమయంలో రెడ్‌క్రాస్ వాలంటీర్లు ముందుండి సేవలు అందించారని తెలిపారు. రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, ప్రథమ చికిత్స శిక్షణ, సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని చెప్పారు. యువత రెడ్‌క్రాస్ స్ఫూర్తిని అలవరచుకొని స్వచ్ఛంద సేవలో పాల్గొనాలని, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ చైర్మన్ గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, డివిజన్ కమిటీ చైర్మన్ సద్ది వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. సేవా దృక్పథం కలిగిన వారు రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సహకారంతో జిల్లాకు బ్లడ్ బ్యాంక్, జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి త్వరలో స్థలం కేటాయింపు చేపడతామని వెల్లడించారు.

ఈ ఏడాది థీమ్ “కీపింగ్ హ్యుమానిటీ అలైవ్” స్ఫూర్తితో మానవత్వ విలువలను కాపాడాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా కమిటీ వైస్ చైర్మన్ దిడ్డి బాలాజీ, డైరెక్టర్లు షేక్ హమీద్ పాషా, ప్రభాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జంపాల అంజయ్య, రాంబాయి, కార్యదర్శి క్రిస్టోఫర్, డివిజన్ కమిటీ డైరెక్టర్ ఐలేని రామ్‌రెడ్డి, లావణ్య, రెడ్‌క్రాస్ సభ్యులు కరిపె నర్సింగ్‌రావు, బండారు శ్రీనివాస్, బిజ్జాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News