లఘు చిత్రాలలో నటిస్తూ, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 3 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న మండల రజిత, రంగయ్యపల్లి గ్రామ నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని రంగయ్యపల్లి గ్రామానికి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా 37 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ చేయబడటం విశేషం.
గతంలో ఆమె భర్త మహేశ్ ఇదే పదవికి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి, ఈ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో, రజిత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 37 ఓట్ల తేడాతో గెలుపొంది గ్రామ ప్రథమ పౌరురాలిగా నిలిచారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి