Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 05:27 AM

ఇంటి నంబర్లు లేని ఇండ్ల సమస్యకు పరిష్కారం..

08-05-2026 168 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండలో క్షేత్రస్థాయిలో కలెక్టర్‌ పరిశీలన..

మంత్రి కోమటిరెడ్డి చొరవతో కదలిక 9,645 ఇళ్ల సమస్య పరిష్కారానికి చర్యలు..

నల్గొండ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏళ్ల తరబడి ఇంటి నంబర్లు, సరైన లింకు పత్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వేలాది మంది గృహస్థుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతోంది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చొరవతో ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

మంత్రి ఆదేశాలతో రంగంలోకి..

​గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ అంశాన్ని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నల్గొండ నగర పరిధిలో సుమారు 9,645 ఇళ్లకు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి.. తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

బస్తీల్లో కలెక్టర్‌ పర్యటన..

మంత్రుల ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టర్ చంద్రశేఖర్ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పానగల్ సమీపంలోని వడ్డెర వాడ, ఐటీ టవర్ ఎదురుగా ఉన్న సుందరయ్య కాలనీలలో ఇంటింటికీ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.​పత్రాలు లేకపోవడానికి గల కారణాలను నేరుగా గృహస్థులను అడిగి తెలుసుకున్నారు. దశాబ్దాలుగా నివాసం ఉంటున్నా సాంకేతిక కారణాలతో ఆగిపోయిన ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. వేలాది ఇళ్లకు త్వరలోనే అధికారిక గుర్తింపు లభించనుండటంతో బాధితుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Sthanikam

ఇంటి నంబర్లు లేని ఇండ్ల సమస్యకు పరిష్కారం..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News