Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:53 AM

ఇందిరమ్మ పథకం ద్వారా మహిళల అభివృద్ధి, పేదలకు ఇళ్ల మంజూరు:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

20-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణం మార్వాడీ గల్లి, నెహ్రూ నగర్, మాన్సూన్ పూర్ ప్రాంతాల్లో మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాన్సూన్ పూర్‌లో నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.ఈ చీరలను రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని చేనేత కార్మిక సంఘాలు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద తయారు చేస్తున్నాయని, దీని ద్వారా స్థానిక చేనేత పరిశ్రమకు ఉపాధి లభిస్తోందని పేర్కొన్నారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్డు అవసరం లేకుండా ఆధార్ కార్డు ఆధారంగా చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.మహిళా సంఘాల సభ్యులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.మహిళల సంక్షేమం కోసం రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం, మహిళా సంఘాలకు జీరో వడ్డీ రుణాల పంపిణీ, మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, సౌర విద్యుత్ కేంద్రాల కేటాయింపు వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ మహిళా శక్తి సమైక్య పేరుతో మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వయం ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని అన్నారు. అలాగే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ పథకం కింద అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ ఉపాధ్యక్షుడు దారం శంకర్ సెట్, పండరి రెడ్డి, రామకృష్ణ, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్ మజీద్, సాయిలు పటేల్, బి. రాజు, శాతం దత్తు, షారుఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ పథకం ద్వారా మహిళల అభివృద్ధి, పేదలకు ఇళ్ల మంజూరు:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News