Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:54 AM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
May 12, 2026 07:13 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇండ్లు లేని ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్ తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని వారు స్పష్టం చేశారు.

సోమవారం ఆత్మకూర్(ఎస్) మండలంలోని బోరింగ్ తండా గ్రామంలో లబ్ధిదారురాలు గుగులోతు లక్ష్మీ ధర్మ గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్లు పేరుతో పేదలను పదేళ్ల పాటు మోసం చేసిందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఇదే విధంగా ఇళ్లు మంజూరు చేస్తూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చుతామని చెప్పారు.

“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే మా ప్రజా ప్రభుత్వ ధ్యేయం” అని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత మంది లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటామని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో బోరింగ్ తండా గ్రామ సర్పంచ్ బిచ్చు నాయక్, కాంగ్రెస్ నాయకులు రవి నాయక్, వాగ్య నాయక్, గుడి చైర్మన్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండపల్లి దిలీప్ రెడ్డి, కుంభం రాజేందర్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ రహీం, జిల్లా ఉపాధ్యక్షుడు ధారవత్ వీరన్న నాయక్, పట్టణ అధ్యక్షుడు యండి అంజద్ అలి, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, ఏలిమినేటి అభినయ్ నాయుడు, ఆలేటి మాణిక్యం, ఫయాజ్, మద్దెబోయిన శ్రీనివాస్, నాగు నాయక్, చెంచల్ నిఖిల్, అబ్బాస్, వాజిద్ మియా, పడిదల రవి, చిట్టి బాబు, ధారవత్ రమేష్, బొల్లెద్దు వినయ్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News